ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి పాస్ పోర్టు, వీసా తప్పనిసరి.
పాస్ పోర్టు మన దేశం జారీ చేస్తే.. వీసా ఆయా దేశాలు జారీ చేస్తుంటాయి.
ఇక అమెరికా తమ దేశం వచ్చే విదేశీయులకు పలు రకాల వీసాలను అందిస్తుంటుంది. అవేంటో తెలుసుకుందాం.
టూరిస్ట్ వీసా B-2: ఇది పర్యాటకులకు జారీ చేస్తుంది. ఈ వీసా గడువు 6 నెలలు మాత్రమే ఉంటుంది.
స్టుడెంట్ వీసా F-1: ఈ వీసా అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి ఇస్తుంది. మీ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది.
తాత్కలిక వర్క్ వీసా H-1B: అమెరికాలో జాబ్ చేయడం కోసం ఈ వీసా అందజేస్తుంది. 3 సంవత్సరాల కాలపరిమితితో ఈ వీసా ఇస్తారు. అవసరమైతే, మరో మూడేళ్లు పొడగిస్తారు.
తాత్కలిక వర్క్ వీసా L-1: విదేశాల్లో ఉన్న తమ కంపెనీ ఉద్యోగులు అమెరికాలోని తమ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అయితే ఈ వీసా ఇస్తారు. కాల పరిమితి ఐదేళ్ల నుంచి ఏడేళ్లు ఉంటుంది.
వ్యాపారవేత్తలకు ఇచ్చే వీసా E-2: అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వీసా జారీ చేస్తారు. కాల పరిమితి తొలుత ఐదేళ్లు ఇస్తారు. ఆ తర్వాత వ్యాపారం కొనసాగిస్తున్నంత కాలం పొడగిస్తారు.
ఇవే కాదు.. అమెరికాతో ఎక్స్ చేంజ్ ప్రొగ్రామ్‌లో భాగంగా వస్తున్న వారికి J-1వీసా, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చే వారికి P-1 వీసా, ఆర్ట్స్, సైన్స్, అథ్లెటిక్స్‌లో అసాధారణ ప్రతిభ ఉన్నవారికి O-1 వీసాను జారీ చేస్తుంది.