ఈ 4 చిట్కాలతో బొద్దింకలను తరిమికొట్టేద్దాం 
బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశించాయి అంటే అంత ఈజీగా విడిచిపెట్టవు. 
కొన్ని సింపుల్ టిప్స్ తో బొద్దింకలను ఇంటి నుండి తరిమేయొచ్చట. 
ఇంట్లోని మూలల్లో లవంగాలు ఉంచడంవల్ల బొద్దింకల బెడద తగ్గుతుంది. 
బిర్యానీ ఆకులను పొడి చేసి ఇంటి మూలల్లో చల్లితే బొద్దింకలు పారిపోతాయి.
బొద్దింకలకు కిరోసిన్ వాసన పడదు. ఆ వాసన దరిదాపుల్లోకి కూడా అవి రావు.
కొద్దిగా కిరోసిన్ తీసుకుని నీటిలో కలిపి అవి తిరిగే మూలల్లో చల్లాలి.
బోరిక్ పౌడర్, పంచదార కలిపి ఉండలు చేసి అక్కడక్కడా పెట్టాలి. అది తిని బొద్దింకలు చచ్చిపోతాయి. 
నోట్: చిన్నపిల్లలు బోరిక్ పౌడర్ మాత్రలు ఉన్నచోటుకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించండి