చలికాలంలో పిల్లల సంరక్షణ కోసం ఇలా చేయాల్సిందే..
చలికాలంలో అనేక జబ్బులు చుట్టుముడతాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గువగా ఉంటుంది కాబట్టి వారిని వైరస్‌లు ఎటాక్ చేసే అవకాశం ఉంది.
చలికాలంలో పిల్లల గది, ఆడుకునే ప్రదేశాలు, చదువుకునే ప్లేస్ అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. దీని వల్ల వైరస్, ఫంగస్ వంటివి ఏర్పడవు.
పిల్లలకు వాడే బట్టలు, సాక్స్, స్కూల్ బ్యాగ్స్, బొమ్మలు అన్నీ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను, అవసరాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి.
చలికాలంలో పిల్లలు బాగా నిద్రపోయేలా చూసుకోవాలి. ఇది వారిలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చురుగ్గా ఉండేలా చేస్తుంది. పిల్లలు రోజులో కనీసం 7 గంటలైనా పడుకునేలా చెయ్యండి.