ఈ యోగాసనాలు మీ గుండెకు ప్రమాదం.. అవేంటో తెలుసుకుందాం..!!
యోగాసనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు, శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, మనసు ప్రశాంతత కొరకు ఇలా చాలా వాటికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
కానీ.. కొన్ని యోగాసనాలు మన గుండెకు ప్రమాదమని మీకు తెలుసా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
హలాసనం: ఈ ఆసనంలో కాళ్లను పైకి లేపడం, ఛాతీని తల దగ్గరకు వంచాలి. దీనివల్ల గుండెకు ఎక్కువ రక్తం పంపిణీ అవుతుంది. అంతేకాక గుండెపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. అయితే గుండె వీక్‌గా ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శీర్షాసన: ఈ ఆసనంలో శరీర బరువు మొత్తం తల, భుజాలపై పడుతుంది. ఈ ఆసనంలోనూ గుండెకు ఎక్కువ రక్తం పంపిణీ కావడంతోపాటు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ గుండె వీక్‌గా ఉన్నవాళ్లకు అంతా మంచిది కాదు.
కర్నాపిరాసనం: ఈ ఆసనంలో వెన్నుతో పాటు మోకాళ్లను బాగా వంచి మీ చెవుల వద్దకు తీసుకురావాలి. ఈ ఆసనంలో కూడా గుండెపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి గుండె బలహీనంగా ఉన్నవారు ఈ ఆసనాలను వేయకుండా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు.
చక్రాసనం: యోగాసనాలలో చక్రాసనం అతి కష్టమైనది. ఈ ఆసనం పర్ఫెక్ట్గా వేయాలంటే కొంత కాలం దీనిపై సాధన అవసరం. ఈ ఆసనంలో ఊపిరితిత్తులు, గుండె వంటి అనేక ప్రధాన అవయవాలపై ప్రభావం ఉంటుంది. అందువల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనానికి దూరంగా ఉంటే మంచిది.