Alert: మీలో ఈ లక్షణాలున్నాయా.. అయితే షుగర్ కావొచ్చు!

మారుతున్న జీవన శైలి కారణంగా ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి వేధిస్తుంది.
చాలా మంది ఈ వ్యాధి ముదిరే వరకు గుర్తించకపోవటంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే, రాత్రి పూట శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.
రాత్రి నిద్రకు ముందు భోజనం చేసినా కూడా మధ్య రాత్రి సమయంలో తరచూ ఆకలి వేస్తే షుగర్ వచ్చే ప్రమాదముంది.
తగిన వెంటిలేషన్‌, గాలి ఉన్నా కూడా రాత్రిపూట విపరీతంగా చెమటలు వస్తే డయాబెటిస్‌ లక్షణమని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి నిద్రపోయిన తర్వాత ఉన్నట్టుండి చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్టుగా అనిపించటం మధుమేహం లక్షణాలు.
రోజంతా అలసిపోయిన నిద్ర సరిగా పట్టకపోవడం వంటివి షుగర్‌ వ్యాధి లక్షణాలు కావొచ్చు.
అర్ధరాత్రి సమయంలో తరచూ తీవ్రంగా దాహం వేస్తే వెంటనే షుగన్ పరీక్షలు చేయించుకోవాలి.
అయితే ఈ లక్షణాలు కేవలం షుగర్‌‌తోనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. కావున వైద్యులను సంప్రదించటం మంచిది.