హోలీ రోజున చిన్నా పెద్ద ఎంతో సంతోషంగా రంగులను పూసుకుంటూ ఆనందంగా గడుపుతారు.
అయితే సింతటిక్ కలర్స్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొడిగా ఉండే రంగులు నోటిలోకి, ముక్కులోకి పోయి శ్వాసకోస ఇబ్బందులు కలుగుతాయి.
అస్తమా ఉన్నవారు హోలీ ఆడకుండా ఉండడం మంచిది. లేదంటే దగ్గు, గురకతో పాటు అస్తమా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
కొన్ని కలర్స్’ను వాటర్ గన్స్, వాటర్ బెలున్స్‌లో వేసి ఆడుతుంటారు. అలా చేయడం వల్ల చెవిలోకి పోయి చెవిపోటు, వినికిడి లోపం వంటివి తలెత్తుతాయి.
అలాగే ఈ కలర్స్ చర్మంపై పడటం వల్ల దురద, దద్దుర్లు, మంట ఏర్పడి పలు రకాల అలెర్జీలు దారి తీస్తుందట. అందుకే పూలు, పసుపు, కుంకుమ వంటి వాటితో హోలీ జరుపుకోవడం మంచిది.