శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు ఇవే?
చలి కాలం చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి మన శరీరానికి రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం.
రోగనిరోధక శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తినాల్సిందే.
నారింజలు: ఈ పండులో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు.
జామపండ్లు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి శరీరంలో ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
కివీ పండ్లు: ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
దానిమ్మ: విటమిన్ K, ఫైబర్ కలిగి ఉన్నందున కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇతర వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది.
సీతాఫలం: క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.