పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ వీరే?

దేవయాని: సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ దేవయాని, తర్వాత రెండు మూడు సినిమాలకే పరిమితం అయ్యింది.
ప్రీతి జింగానియా: తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ఈమె తర్వాత నరసింహనాయుడు, అధిపతి వంటి చిత్రాలలో నటించి ప్యాకప్ చెప్పేసింది.
సుప్రియ యార్లగడ్డ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో ఈమె హీరోయిన్‌గా నటించిన తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
కీర్తి రెడ్డి: హీరో సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి. తొలిప్రేమలో పవన్‌కు జోడిగా నటించిన ఈమె చివరగా అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది.
రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలోను నటించలేదు.
నేహా ఒబెరాయ్: బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన, తర్వాత జగపతిబాబుతో ఓ సినిమాలో నటించింది.
మీరా చోప్రా: బంగారం సినిమాలో పవన్ సరసన నటించిన మీరా చోప్రా ఆ తర్వాత రెండు, మూడు సినిమాలకే పరిమితం అయింది.
నికిషా పటేల్: కొమరం పులి చిత్రంతో లో నటించిన బ్యూటీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో “ఓమ్ 3d” లో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలో నటించలేదు.
సారాజెన్ డియాస్: పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా ఆ తర్వాత మళ్లీ కనపడలేదు.