పొన్నగంటి కూర తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలెన్నో!
ఇందులో ముఖ్యమైనది పొన్నగంటి కూర. దీనిని తినడానికి ఎక్కవగా ఇష్టపడరు. కానీ ఇది పల్లెటూర్లలో పిచ్చిగా పెరుగుతుంది. ఈ కూర తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పొన్నగంటి కూరలో బీటా కెరోటిన్,విటమిన్ సి, ఉంటాయి. గుప్పెడు ఈ ఆకుకూరను తీసుకొని, ఒక టీ స్పూన్ తేనె,ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్సీ పట్టించి ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను రాకుండా చేస్తుంది.
ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఉండి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్‌ను నివారించడంలో పొన్నగంటి కూర ఉపయోగపడుతుంది.
ఇటీవల చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని గుండె పోటు వేధిస్తున్న విషయం తెలిసిందే. అయితే పొన్నగంటి కూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
పొన్నగంటి కూర మేలు చేస్తుందని అతిగా తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి మొతాదుగా తినడం మంచిది.