యముడి పాత్రలో కైకాల మెప్పించిన సినిమాలు ఇవే

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయన అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇక ఈయన చాలా సినిమాల్లో యుముడి పాత్రల్లో కనిపించారు.
యుముడి గెటప్‌లో ఈయనను చూస్తే నిజంగా యముడు ఇలానే ఉంటారేమో అనుకునేవారు లేకపోలేదు.
కాగా, కైకాల యుముడి పాత్రలో కనిపించిన సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
యమగోల : సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ యముడిగా కనిపించి అలరించారు.
యముడికి మొగుడు : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో యముడి పాత్రలో కైకాల అద్భుతంగా నటించి అలరించారు.
యమలీల : SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యముడిగా కైకాల అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు.
యమగోల మళ్ళీ మొదలైంది : శ్రీకాంత్,వేణు లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రిటైర్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు.
దరువు : రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కూడా కైకాల సత్యనారాయణ యముడిగా కనిపించి మెప్పించారు.