ఒత్తిడి.. టెన్షన్ నుంచి బయటపడే బెస్ట్ విటమిన్ ఫుడ్స్ ఇవే?
మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చూడడంలో విటమిన్ బి 6 బాగా పనిచేస్తుంది. ఇవి శరీర ప్రోటీన్లను గ్రహించడంలో కూడా మేలు చేస్తాయి.
క్యారెట్లలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌తోపాటు కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ - ఎ కూడా క్యారెట్లలో దొరుకుతుంది.
ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి న్యూట్రియెంట్స్ ఉండే పాలకూర తింటే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
బ్రేక్ ఫాస్ట్ ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు తింటే విటమిన్ బి6 లోపం ఏర్పడదు.
పచ్చి బఠాణీల్లో విటమిన్ బి6 ఎక్కువ. వీటిని సలాడ్స్ లేదా సైడ్ డిష్ క్యారెట్లు, ఆలుగడ్డలతో కలిపి తింటే టెన్షన్ తగ్గుతుంది.
క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్ నట్స్, అవకాడోలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి.
విటమిన్ బి6 ఎక్కువగా ఉండే టమాట, కీరదోస తింటే నార్మల్ మూడ్‌కు వచ్చే చాన్స్ ఉంటుంది.
శెనగలు, చేపలను డైట్‌లో చేర్చినా బి6 లోపం నుంచి బయటపడొచ్చు.
అలాగే పుదీనా జ్యూస్ తాగడం వల్ల ఒత్తిడి, టెన్షన్ నుంచి బయటపడే చాన్స్ ఉంది.