పెళ్లికి వేళాయే.. మూడు ముళ్లకు మంచి ముహుర్తాలివే!
కళ్యాణం, కమనీయం అనే పాటలతో ఇక వాడ వాడ మారు మోగనుంది.
నాలుగు నెలల నుంచి మంచి ముహుర్తాలు లేకపోవడంతో, చాలా మంది యువతీ,యువకులు మంచి ముహుర్తాల కోసం ఎదురుచూస్తున్నారు.
2022 పంచాంగం ప్రకారం డిసెంబర్‌లో వివాహాలకు మంచి ముహుర్తాలున్నాయి.
డిసెంబర్ 16 నుంచి జనవరి 14 మినహయిస్తే మార్చి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు.
నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 12 వరకు ఏడు బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు
డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో ఈ సమయంలో వివాహాలు చేయరు.
జనవరి 2023లో వివాహానికి మొత్తం 9 శుభ ముహూర్తాలు ఉన్నాయి. 15, 16, 18, 19, 25, 26, 27, 30, 31 తేదీలు.
మార్చి 2023లో వివాహానికి 4 శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. 6, 9, 11, 13 తేదీలు