రాత్రిళ్లు సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల ప్రయోజనాలెన్నో

శీతాకాలం చలి తీవ్రతతో చాలా మంది నిద్రపట్టక నానా అవస్థలు పడుతుంటారు.
అయితే రాత్రిళ్లు హాయిగా పడుకోవాలంటే పాదాలకు సాక్సులు వేసుకుని పడుకుంటే నిద్రతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయి.
నైట్ టైమ్ కాళ్లకు సాక్సులు ధరిస్తే రక్త ప్రసరణ మెరుపడుతుంది. దీంతోపాటు గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
ముఖ్యంగా మహిళలకు రుతుక్రమం సమయంలో నిద్ర సమస్యలు వస్తాయి. అలాంటి వారు సాక్సులు వేసుకోవడం మంచిది.
చలికాలం వచ్చిందంటే చాలు పాదాలు పగిలి నొప్పి, రక్తస్రావం మొదలవుతుంది. కాబట్టి సాక్సులతో వాటికి చెక్ పెట్టండి.
ఎంత ట్రై చేసినా నిద్రపట్టక ఇబ్బందులు పడేవారు సాక్సులు వేసుకుంటే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
గమనిక: మరీ టైట్‌గా ఉన్న సాక్సులకు అస్సలు వేసుకోవద్దు. అలాగే ప్రతిరోజూ శుభ్రం చేసిన వాటినే ఉపయోగించాలి.