చలికాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?
ఇటీవల చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలు, అలాగే ఎంతో మంది చిన్న పిల్లలు సైతం హార్ట్ స్ట్రోక్ బారిన పడ్డారు.
అయితే చలికాలం ఎక్కువగా గుండె జబ్బులు ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక రక్తపోటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అలా కాకూడదంటే ప్రతి రోజు ఈ పనులు చేయాలి.
ఒక్క రోజులో దాదాపు తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలి. లేదంటే పలు రకాల అనారోగ్య సమస్యలతో పాటు గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఉదయం పూట నడక చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. చలికాలం గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్త రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
అలాగే ఉదయం పూట కొందరు వర్క్‌లో బిజీ అయిపోయి లేదా నిద్ర డిస్టబ్ అవుతుందని టిఫిన్ తినకుండా డైరెక్ట్ లంచ్ చేస్తుంటారు. అలా చేయకూడదు పొద్దున ఏదో ఒక టిఫిన్ తినడం మంచిది.
కొందరికి ఏ సీజన్ అయినా కానీ తాగడాన్ని చాలా ఇష్టపడుతుంటారు. మద్యంపానం, దూమపానం అలవాటు ఉంటే గుండెకు హాని కాబట్టి మానుకోవాలి.
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఉదయం పూట ప్రతి రోజు ధ్యానం చేయాలి. అలా చేయడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. అలాగే దీంతో ఒత్తిడి మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.