సమ్మర్‌లో తాటిముంజలను తినడం వల్ల కలిగే లాభాలివే..!
ఎండలకు తట్టుకోలేక మార్కెట్‌లో విరివిగా దొరికే తాటిముంజలను చిన్నా, పెద్ద ఎక్కువగా తింటుంటారు.
అయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, జింక్, ఐరన్, పోటాషియం పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణుల సలహా.
తాటి ముంజలను తినడం వల్ల అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
అలాగే జీర్ణ సమస్యలతో బాధడేవారు తాటి ముంజలను తినడం మంచిది. ముఖ్యంగా గర్భినీలకు వాంతులు రాకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాలి.
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
వేసవిలో వేడి దద్దుర్లు, పొక్కులు వంటి చర్మ సమస్యలకు తాటిముంజల గుజ్జును శరీరంపై పూసుకుంటే దురద నుంచి ఉపశమనం పొందవచ్చు.
తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండి బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరం డీహైడ్రేషన్‌‌కు గురి కాకుండా ఉండేలా చేస్తాయి.
ముంజల పైన పొట్టుతోనే చాలా లాభాలున్నాయి. అందువల్ల తాటి ముంజలను పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.