గుండె సంబంధిత వ్యాధులు కేవలం వయసు మీదా పడిన వారికే కాకుండా చిన్న పిల్లలను సైతం ఆ సమస్యలు వెంటాడుతున్నాయి. పిల్లల్లో ముఖ్యంగా ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్లు.
ఊపిరి ఆడకపోవడం, అలసట లేదా బలహీనమైన అనుభూతి.. ఆడుకునే సమయంలో తొందరగా అలిసిపోవడం
శ్లేష్మ పొరలు, పెదవులు, గ్లోర్ల రంగు మారడం.. లేదా చర్మం బూడిద- నీలం రంగులో కనిపించడం
గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్చపోవడం, తల తిరగడం.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలి
ముఖ్యంగా పిల్లల్లో ఛాతి నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది
ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బంది, ఎదుగుదల మందగించడం ఇవన్నీ ప్రమాదకర సింటోమ్సే..
ఎదిగె పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
పైన కనిపించిన ఏ లక్షణాలైన సరే మీ పిల్లల్లో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది