సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
నిన్న వెల్లడించిన బులిటిన్ ప్రకారం ఆయన ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ. ఆయన 1943 మే 31 న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు.
సూపర్ స్టార్ కృష్ణ 350 కి పైగా సినిమాల్లో నటించారు. భౌతికంగా ఆయన మరణించినా తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు.