స్టార్ ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
స్టార్ ఫ్రూట్ రుచిలో తియ్యగా ఉండి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో తీసుకునే ఆహార శాతం తగ్గి.. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.
స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగలకుండా ఉంటుంది.
స్టార్ ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్,అసిడిటీ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త నాళాల్లోని అడ్డంకులను ,హైబీపీని తగ్గిస్తుంది.
స్టార్ ఫ్రూట్లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తితో పాటుగా పాటు కళ్ళను కూడా సంరక్షిస్తుంది.
ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్గా పనిచేస్తుంది. మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.