Nokia G11 Plus Features: ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులు బ్యాటరీ లైఫ్..
నోకియా తన G సిరీస్‌లో కొత్త మోడల్‌‌ను తీసుకొచ్చింది. ఇంతకుముందు వచ్చినటువంటి G11కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్.
ఈ స్మార్ట్ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ వెల్లడించింది.
ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ వెర్షన్స్ అప్‌డేట్‌లను, అలాగే మూడు సంవత్సరాల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది.
6.57 అంగుళాలు, 720x1600px, వాటర్ డ్రాప్ నాచ్‌తో 90 Hz డిస్ప్లే.
Unisoc T606, ఆక్టా కోర్, 1.6 GHz ప్రాసెసర్. ఆండ్రాయిడ్ v12 ద్వారా పనిచేస్తుంది.
50MP బ్యాక్ కెమెరా + 2MP డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది.
4GB RAM, 64GB మెమరీ, దీనిని మెమరీ కార్డు ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు.
18W ఫాస్ట్ చార్జింగ్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ చార్‌కోల్ గ్రే, లేక్ బ్లూ కలర్స్‌లలో వస్తుంది
దీని ధర రూ. 12,000 లోపు ఉండే అవకాశం ఉంది.