హాలీవుడ్ వెబ్ సిరీస్.. సమంతకు మరో బంపర్ ఆఫర్ 
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సమంత నేషనల్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది.
అదే రేంజ్‌లో మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సామ్.
ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌ను భారతీయ భాషల్లో రీమేక్ చేయనున్నారు.
ఈ సిరీస్ లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించబోతుంది సమంత.
యాక్షన్‌తో కూడిన సిరీస్ కావడంతో, ఇప్పటికే సామ్ ట్రైనింగ్ మొదలు పెట్టినట్లు టాక్ .
అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ దగ్గర మూడు నెలల పాటు శిక్షణ తీసుకోబోతున్నట్లు సమాచారం.