ఈ లక్షణాలున్నాయా.. త్వరగా ముసలి వాళ్లవుతారు!

మన ఆరోగ్యానికి విటమిన్ C ఎంతో మేలు చేస్తోంది. చర్మ సంరక్షణలో రోగ నిరోధక శక్తిని పెంచటంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ C లోపిస్తే వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..
విటమిన్ C అనేది మన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక విటమిన్ C లోపిస్తే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. చర్మం ఎర్రబడడం, దద్దుర్లు రావడం, చర్మం డ్రైగా మారడం వంటి సమస్యలు చోటుచేసుకుంటాయి.
కీళ్ల నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం, ఎనీమియా, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దంత క్షయం, పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం సమస్యలు వస్తాయి.
బరువు తగ్గడం, చీటికిమాటికి కళ్ళు తిరగడం, పాలిపోవడం వంటి అనేక లక్షణాలుంటాయి.
విటమిన్ C లోపం రాకుండా ఉండాలంటే సిట్రస్ పండ్లు, కూరగాయలు మన ఆహారంలో భాగం చేసుకోవాలి.