ప్రపంచంలోనే అత్యంత అందమైన పాముల గురించి మీకు తెలుసా?

పాము అంటే భయపడని వారుండరు. ప్రపంచంలో రకరకాల పాములు ఉన్నాయి.
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి.
ఒక్కో జాతి పాముకు ఒక్కో స్వభావం ఉంటుంది. దాన్ని బట్టే పాములు రంగు, విష ప్రభావం కలిగి ఉంటాయి.
ఇక పాముల్లో కూడా అందమైన పాములు ఉంటాయి. అందంతో పాటు ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా.
బ్లూ కోరల్ స్నేక్: ఆగ్నేయాసియాలో కనిపించే ఈ పాము నలుపు లేదా ముదురు నీలం రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యంత విషపూరితమైన పాముల్లో ఇది ఒకటి.
శాన్ ఫ్రాన్సిస్కో గార్టర్ పాము: ఇది నీలం లేదా ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటుంది. దీని విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
అరిజోనా కోరల్ స్నేక్: అరిజోనా, మెక్సికోలో కనిపించే ఈ పాము అత్యంత విషపూరితమైనది. ఎరుపు, నలుపు, పసుపు చారలతో ఆకర్షణీయంగా ఉంటుంది.
కింగ్ కోబ్రా: ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా.
రెయిన్బో బోవా: ఈ పాము అమెజాన్ బేసిన్‌లో కనిపిస్తుంది. ఇది ఎరుపు-గోధుమ రంగులో మరి లావుగా, మరి సన్నగా కాకుండా ఉంటుంది.