ఎలుకల బెడద వేధిస్తుందా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ..!

చాలా మంది ఇండ్లలో ఎలుకల బెడద ఉంటుంది. ఎలుకలు ఇంట్లో ఉన్న వస్తువులను నాశనం చేస్తుంటాయి.
ఎలుకలు ఇంట్లో సరుకులన్నీటిని ముట్టడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
ఎలుకలను తరిమికొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఎలుకలకు చెక్ పెట్టొచ్చట.
పుదినా నూనెను ఇంటి మూలల్లో చల్లితే ఆ ఘాటు వాసనకు ఎలుకలు రాకుండా ఉంటుంది.
అలాగే లవంగాలు, మిరియాలను పొడిగా చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో చల్లితే ఈజీగా బయటకు పారిపోతాయి.
ఒక క్లాత్‌లో కొద్దిగా కారం మూట కట్టి ఎలుకలు ఉన్న దగ్గర పెడితే మంచి ఫలితం ఉంటుంది.
ఉల్లిపాయలను రెండుగా చీల్చి పెడితే ఘాటు వాసనకు ఎలుకలు ఆ దరిదాపుల్లోకి కూడా రావట.