Barley Water Preparation: బార్లీ వాటర్ తయారు చేసుకోండిలా
బార్లీ వాటర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు 
ఒక ఫుల్ స్పూన్ బార్లీ గింజలు, గ్లాస్ వాటర్, పటిక లేదా తేనె, కొద్దిగా నిమ్మరసం (ఆప్షనల్)
స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో వాటర్, బార్లీ గింజలు వేసి 5 నిమిషాలపాటు మరిగించాలి 
మరిగిన నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టాలి 
ఆ నీళ్లలో పటిక బెల్లం లేదా తేనె కలపాలి 
ఇష్టపడేవారు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు
ఈ నీటిని ఉదయం పరగడుపునే లేదా సాయంత్రం తాగితే ఫలితం ఉంటుంది
ఎండలో నుండి వచ్చిన తర్వాత తాగితే త్వరగానీరసం తగ్గుతుంది