పోలీస్ ఈవెంట్స్ : లాంగ్ జంప్ అంటే భయపడుతున్నారా?
మనలో చాలా మందికి లాంగ్ జంప్‌ గురించి తెలియదు.
అలాగే తెలియకుండా పార్టిసిపేట్ చేసి విఫలమవుతున్నారు.
దీంతో అభ్యర్థులందరూ లాంగ్ జంప్‌ అంటే చాలా భయపడుతున్నారు.
అలాంటి వారి కోసమే ఈ టిప్స్‌..చదివి ఫాలో అవ్వండి.
లాంగ్ జంప్ చేసే ముందు ఫ్రీగా ఉండాలి , రన్ వేపై రన్నింగ్ చేసే క్రమంలో రైట్, లెఫ్ట్ మధ్య అడుగుల దూరం గమనించాలి.
పరుగు చిన్నగా మొదలు పెట్టి.. మెల్లి మెల్లిగా వేగాన్ని పెంచుతూ జంప్ చేసే ముందు గాలిని తీసుకొని.. దూకే ముందు గాలిని వదిలేయండి.
అక్కడున్న గమ్యం కన్నా.. మీరు రెండు మూడు అడుగులు ఎక్కువ దూరం గమ్యం పెట్టుకోవాలి.
షూ వేసుకోకపోవడమే మంచిది.. ఎందుకంటే పరుగు పెట్టె సమయంలో వేగంగా పరుగెత్తవచ్చు.
టేకప్ బోర్డ్ వద్ద జాగ్రత్త వహించాలి.