Poco M5 స్మార్ట్ ఫోన్: అతి తక్కువ ధరలో భలే ఫీచర్స్

సరికొత్త ఫీచర్లతో ‘Poco M5’ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి 
కొత్త Poco M-సిరీస్ ఫోన్ వాటర్-డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటక్ట్ చేయబడుతుంది.
6.58-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌.
హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13 పై రన్ అవుతుంది.
Widevine L1 సర్టిఫికేషన్‌తో వస్తుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో 1080p రిజల్యూషన్‌లో వీడియోలను చూడవచ్చు.
ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+2MP+2MP కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.
గేమ్ టర్బో 5.0 ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ ఐసీ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
4GB RAM 64GB వేరియంట్ ధర రూ.12,499. 6GB RAM 128GB స్టోరేజ్‌ ధర రూ.14,499. సెప్టెంబర్ 13 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సమయంలో, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు.
ఇంకా Poco డిస్నీ+ హాట్‌స్టార్‌కు 1 సంవత్సరం ఉచిత సభ్యత్వాన్ని, ఆరు నెలల ఉచిత స్క్రీన్ ప్రొటక్షన్ అందిస్తామని కంపెనీ తెలిపింది.