నెలసరి నొప్పులకు ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి
రజస్వరాలు అయిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక సందర్భంగా నెలసరి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రతినెల ఆ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
నెలసరి కూడా సక్రమంగా రాక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలతో తరచూ మెడిసిన్ వాడుతూ అవస్థలు పడుతుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.
ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10 నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం కలిపుకుని తాగాలి. ఇలా మూడు వారాలకు ఒకసారి తాగినట్లయితే నెలసరి సరైన సమయానికి వస్తుంది.
పీరియడ్స్ సమయంలో నాలుగు రోజులు పలుచని నిమ్మరసం తాగితే అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు.
నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన సమయానికి వస్తాయి. నెలసరి నొప్పి నుంచి విముక్తి పొందాలంటే గ్లాసు అల్లం రసంలో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.