టమోటాలను ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!

సాధారణంగా టమోటాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ప్రతి వంటకంలో వీటిని ఉపయోగిస్తారు.
ఎన్ని లాభాలున్నప్పటికి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా టమోటాలను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు టమోటాలను తింటే ఇందులో ఉండే పులుపు వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి ప్రమాదంలో పడతారు.
దద్దుర్లు, తామర వంటి చర్మ సమస్యలు ఉన్న వారు టమోటాలను తినడం వల్ల అలెర్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
టమోటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లోని రాళ్ల సమస్య బాధిస్తుంది.
టమోటాలు సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. కాబట్టి అతిసారం ఉన్న వారు తినకూడదు.
శ్వాసకోశ సమస్యలు ఉంటే టమోటాలను ఎక్కువగా తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
టమోటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉన్నందున గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది.