ఈ వ్యాధులతో బాధపడేవారు ఉసిరికాయను అస్సలు తినకూడదు..
ఉసిరిలో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..
ఉసిరికాయ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కళ్లు బాగా కనపడతాయి.. హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇలాంటి చాలా లాభాలు ఉన్నాయి..
అయితే కొన్ని వ్యాధులతో బాధపడే వారు మాత్రం ఉసిరి కాయను తినడం మంచిది కాదట.. అవి ఏంటో తెలుసుకుందాం..
రక్తంలో షుగర్ లెవల్స్ మరీ తక్కువగా ఉంటేవారు ఉసిరిని తినకూడదు. ముఖ్యంగా యాంటీబయోటిక్ మందులు తీసుకునే వారు అస్సలు తినకూడదు. అలా కాదని తీసుకుంటే ఆరోగ్యం మరింత క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది..
లో బీపీ ఉండే వారు ఉసిరి కాయలను తినకూడదు. ఒకవేళ తిన్న తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ ఉసిరి కాయలు తిన్నట్లయితే బీపీ స్థాయి మరింత తగ్గే సమస్య ఉంది..
ఏదైనా సమస్యకు శస్త్రచికిత్స చేయించుకోవాలి అనుకునేవారు 2, 3 వారాల ముందు నుంచే ఉసిరి తినడం ఆపేయాలి. వాటిని తినడం వల్ల రక్తనాళాలు పగిలిపోయి.. రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఉసిరి తినకూడదు. తింటే శరీరంలో సోడియం పరిమాణం పెరిగిపోవడంతో.. మూత్రపిండాలకు ఫిల్టర్ చేయడం కష్టం అవుతుంది.
ఉసిరిలో చలవ చేసే గుణం ఉంటుంది. అందుకే జలుబు, జ్వరంతో బాధపడేవారు ఉసిరి కాయను తినకుండా ఉండటమే మంచిది..