చాలా మంది పనస పండు వాసన భరించలేక దానిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ, పసన పండుతో చాలా లాభాలు కలుగుతాయి.
ఈ పండులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి.
డయాబెటిస్, అల్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారు పనస పండును తినడం మంచిది.
పనస పండులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే హైబిపీని తగ్గిస్తుంది.
ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా పేగు కదలికలను సక్రమంగా ఉండటానికి సహాయపడుతుంది.
పనస తింటే ముఖ్యంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పురుషులకు లైంగిక సమస్యలు రాకుండా ఉంటుంది.
విటమిన్-A కంటిచూపును మెరుగుపరిచి రేచీకటిని తగ్గుస్తుంది. పనస తొనలను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.