ఫ్యాషన్: మాకు లూజే ఇష్టమంటోన్న అమ్మాయిలు

ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటున్నాయి. 
ట్రెండ్ కి తగ్గట్టే అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారుతూ వస్తోంది. 
ప్రజెంట్ మార్కెట్ లో నడుస్తోన్న ఫ్యాషన్ ట్రెండ్ లూజ్ దుస్తులే.
ఒకప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో వంటికి అద్దినట్టు ఉండే బట్టలే ఎక్కువమంది అమ్మాయిలు ఇష్టపడేవారు. 
ఇప్పుడు షర్ట్స్, ట్రౌజర్స్, లాంగ్ కోట్స్, స్వెట్ షర్ట్స్ ఇలా ఏవైనా సరే వదులుగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు.