రూ. 7 వేలలోపు ధరలో Moto స్మార్ట్ ఫోన్

Moto E13 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 8న ఇండియాలో లాంచ్ కానుంది.
ధర రూ. 6,999 వరకు ఉంటుంది.
ఫోన్‌లో 6.5-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు.
UnisoC T606 SoCతో పాటు Mali-G57 MP1 GPUని చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)తో రన్ అవుతుంది.
ఫోన్‌లో 13MP బ్యాక్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉంది.
4GB RAM, 64GB మెమరీ ఉంది, దీనిని మైక్రో SD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
10W చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.