సాధారణంగా పువ్వులను పూజలు చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు.
అలాగే మహిళలు తలలో పెట్టుకోవడానికి, ఇళ్లను అలంకరించడానికి పువ్వులను ఉపయోగిస్తారు.
కానీ లక్షలు, కోట్లు విలువ చేసే పువ్వులు వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్కిడ్ పూల ధర మార్కెట్‌‌లో రూ. 16.54 కోట్లు ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 4, 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది.
జూలియట్ రోజ్ పువ్వు ధర రూ.130 కోట్లు. ఈ పువ్వును డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి 15 సంవత్సరాలు శ్రమించి దీనిని సృష్టించాడు.
ఆకర్షణీయంగా ఉండే గోల్డ్ కినాబాల్ పుష్పం ధర రూ.4.96 లక్షలు పలుకుతోంది. ఇది వికసించడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందట.
భారతీయులు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కుంకుమ పువ్వు కిలో రూ.3 లక్షలు. 500 గ్రాముల రేకులకు రూ.80 వేలు ఉంటుందట.
బ్రహ్మ కమలం పువ్వు అన్నింటికంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ పువ్వు విలువను ఇప్పటి వరకు ఎవ్వరూ అంచనా వేయలేదట. దీని ప్రత్యేకత ఏంటంటే వ్యక్తులను మైమరిపించే సువాసన వెదజల్లడం. అలాగే ఈ పువ్వు వికసించిన కొన్ని గంటల్లోనే ఎండిపోతుందట.