చాలా మంది వైద్యులు కూరగాయల కంటే ఎక్కువగా ఆకు కూరలను తినాలని చెబుతుంటారు.
ఆకుకూరల్లో ఉండే ఐరన్, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ శరీరానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి.
ఇందులో ముఖ్యంగా చుక్క కూరను తినడం వల్ల ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
చుక్క కూరలో నీటిశాతం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి బాలింతలకు పాలు బాగా వచ్చేలా చేస్తాయి.
చుక్క కూర రసంలో పాలు కలిపి తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు చుక్క కూరను పదేపదే వండుకుని తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఈ కూరను తింటే ముఖ్యంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
చుక్క కూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.