ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ ప్రతీసారి అందరికీ ఇది సాధ్యం కాదు.
అలా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే కొన్ని పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది.
డబ్బు మీ వద్ద నిత్యం ఉండాలంటే.. మీ ఇంట్లో ఆటంకాలు పరిచే వస్తువులను, అలవాట్లను మార్చాలి. ఫలితంగా లక్షీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది.
శాస్త్రాల ప్రకారం సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. అప్పటినుంచి ఆమె విష్ణువు సేవలో నిమగ్నమై ఉంది.
లక్ష్మీ దేవి సంచల స్వభావి అని.. ఒక చోట ఉండదు అని చెబుతారు. అయితే ఎవరికైతే లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందో వారికి ఏ విధంగాను డబ్బుకు లోటు ఉండదు.
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకంటే దీని కోసం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఖచ్చితమైన చిట్కాలు ఉంటాయి. వాటి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం..
ఏ ఇంట్లో అయినా ఆడవారు భోజనం చేసేటప్పుడు కాళ్లు ఊపితే లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉండదు. అంతేకాకుండా ఆ ఇంట్లో భర్తలకు ఉద్యోగాలు కూడా ఉండవు.
ఆడవారు చీపురును కాళ్లతో తొక్కిన, జంతువులకు చీపురుతో కొట్టిన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఎందుకంటే చీపురులో లక్ష్మీ నివాసం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి.
ఎవరితే రాత్రి పూట ఎంగిలి గిన్నెలు కడగకుండా అలాగే ఉంచి పడుకుంటారో ఆ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది.
చాలా మంది ఇంటి డోర్ తీసేటప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అలా రావడం దరిద్రానికి సంకేతం. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి ముఖ ద్వారం గుండా వస్తుంది. అందుకే ఇంటి తలుపులు తీసేటప్పుడు శబ్ధాలు రాకూడదు.