కరెంట్ బిల్ అధికంగా వస్తుందా.. తక్కువ రావాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

ప్రస్తుతం విద్యుత్ చార్జీలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడికి కరెంట్ బిల్లు కట్టాలంటేనే కష్టంగా మారింది.
కరెంట్ చార్జీలను తగ్గించే అవకాశం మనకు లేదు కానీ, కరెంట్‌ను సక్రమంగా వాడుకోవడం ద్వారా కాస్త వ్యయాన్ని మాత్రం సులభంగా తగ్గించవచ్చు.
ఏసీ, కూలర్లు: ఇవి అధిక కరెంట్‌ను వినియోగించుకుంటాయి. వీటిని తక్కువ, లేదా ఎక్కువ టెంపరేచర్‌లో కాకుండా మధ్యస్తంగా వాడుకుంటే బిల్లులో వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది.
LED లైట్లు: సాధారణ బల్బులు కంటే LED బల్బులు ఎక్కువ కాంతిని ఇవ్వడంతో పాటు.. తక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటాయి.
హీటర్, గ్రీజర్: ప్రస్తుతం చలికాలం కాబట్టి ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇవి వెంట వెంటనే వినియోగించకుండా కాస్త గ్యాప్ ఇస్తే మంచిది.
వాషింగ్ మిషన్: వాషింగ్ మిషన్‌లో దాని సామర్థ్యం తగ్గట్టుగా బట్టలు వేయడం మంచిది. అధికంగా వేయరాదు.
సాధారణంగా అందరూ చేసే తప్పులు.. టీవీలు, కంప్యూటర్స్, ఫ్యాన్స్ వినియోగించడం అయిపోగానే వాటిని ఆఫ్ చేయరు. ఈ తప్పులను అరికడితే కరెంట్ బిల్ ఆధా చేయోచ్చు..