అటాచ్డ్ బాత్రూమ్ అలా ఉంటే భార్యభర్తల మధ్య విడాకులకు దారితీస్తుందట!

టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటి నుండి కొత్త డిజైన్‌లతో అందంగా ఎవరికి నచ్చినట్టు వారు ఇంటిని నిర్మించుకుంటున్నారు.
ఈ బిజీ బిజీ జీవన శైలిలో బద్ధకం వచ్చి ఎక్కువ దూరం నడవలేకపోతూన్నారు. అందుకని చాలా మంది రూమ్స్‌లోనే బాత్రూమ్‌లను కట్టుకుంటున్నారు.
కానీ, కొంత మంది వాస్తు ప్రకారం కట్టడం లేదు. కాబట్టి కొత్తగా నిర్మాణం చేపట్టినా, లేదా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నవారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలట.
బెడ్ రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అటు వైపు పాదాలను పెట్టకూడదు. లేదంటే భార్యభర్తల మధ్య గొడవలు జరిగి ఒక్కోసారి విడాకుల వరకు దారితీస్తుందట.
నిద్రపోతున్నప్పుడు బాత్ రూమ్ తలుపులు మూసి వేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
బాత్ రూమ్‌లో టాయిలెట్ సీటును ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల పలు ఇబ్బందుల నుండి కాపాడుకోవచ్చు.
అటాచ్డ్ బాత్ రూమ్‌లకు వాస్తు దోషాలు ఉంటే ఒక గాజు పాత్రలో ఉప్పును నింపి మూలకు పెట్టాలి. దానిని వారానికి ఒకసారి మార్చితే దోషాలు తొలగిపోతాయట.