భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇవి చేయాల్సిందే..
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఆ గొడవలు మర్చిపోయి అన్యోన్యంగా ఉండటానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.
కానీ.. తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దీంతో కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తుంటారు.
అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం..
బాధ్యత: మీ భర్త లేదా భార్య పట్ల మీరు బాధ్యతగా ఉండాలి. వారికి కావాల్సిన వాటిని బాధ్యతగా స్వీకరించాలి.
భరోసా: మీ భార్య లేదా భర్తకి నేను ఉన్నాను అనే భరోసా కల్పించండి. ఇలా భరోసా కల్పిస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి.
ప్రోత్సాహం: మొదట మీ ప్రోత్సాహం తోనే మీ భార్య లేదా భర్త విజయాన్ని సాధించడం సాధ్యం అవుతుంది. నిరుత్సాహ పరచకుండా ఎల్లప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి.
కేరింగ్: వైవాహిక జీవితంలో కేరింగ్ అనేది అతి ముఖ్యమైనది. మీ భార్య లేదా భర్త మీదా మీరు చూపించే కేరింగ్ మీపైన ప్రేమను పెంచుతుంది.
కమ్యూనికేషన్: భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ కమ్యూనికేషన్. ఏ సమస్య వచ్చినా మొదట ఇద్దరూ కూర్చుని నిదానంగా మాట్లాడుకుంటే అసలు గొడవలు అనేవి రాకుండా ఉంటాయి.