కారులోనే YS షర్మిల.. క్రేన్ తో పోలీసులు ఎలా తీసుకెళ్తున్నారో చూడండి
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నర్సంపేటలో ఘటన నేపథ్యంలో, ఆమె ఈరోజు ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు
ధ్వంసమైన కారును సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ప్రగతి భవన్ వైపు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు
వాహనం దిగాలని పోలీసులు కోరినా ఆమె వినలేదు. డోర్ లాక్ చేసుకుని కారులోనే ఉండిపోయింది.
షర్మిలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు.
దీంతో క్రేన్ తెప్పించిన పోలీసులు షర్మిల డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండగానే, క్రేన్ సాయంతో కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.