నాన్‌స్టాప్‌గా ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
చాలా మందికి అన్నం తినే సమయంలో లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే, కొందరికి మాత్రం ఎక్కిళ్లు నాన్‌స్టాప్‌గా వస్తూ ఇబ్బందిని కలిగిస్తాయి.
తరచుగా రావడం వల్ల కష్టంగా అనిపిస్తుంటుంది. అలా ఎక్కువ సమయంపాటు ఎక్కిళ్లు వస్తే ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి.
ఎక్కిళ్లు తగ్గాలంటే గోరు వెచ్చని నీటిలో కొన్ని పుదీనా ఆకు, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ నీటిని తాగడం వలన ఎక్కిళ్లు తగ్గుతాయి.
అలాగే చిటికెడు ఇంగువ పొడిని అర టీ స్పూన్ వెన్నతో కలిపి తింటే ఎక్కిళ్లు పరార్ అవుతాయట.
శొంఠి, కరక్కాయ పొడిని మిక్స్ చేసి.. ఒక చెంచా పొడిని నీటితో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎక్కిళ్లు ఎక్కువగా ఉంటే.. నిమ్మకాయ ముక్కను వాసన పీల్చుకోవాలి.
ఎక్కిళ్లను ఆపడంలో యాలకుల నీరు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. 2 యాలకులను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి.
ఎక్కిళ్లు అస్తమానం వస్తుంటే కాస్త తేనెను తీసుకుంటే మంచిది.