Betel Leaf Benefits : రోజూ ఒక తమలపాకు తింటే ఊహకందని ప్రయోజనాలు
తమలపాకు, వక్క, సున్నం కలిపి తాంబూలం వేసుకోవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం.
రోజుకి ఒక తమలపాకు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నూతన పరిశోధనలు చెబుతున్నాయి. 
తమలపాకుని డైరెక్ట్ గా తిన్నా, జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.
తమలపాకు గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
నీటిలో తమలపాకులు వేసి రాత్రంతా నానబెట్టి, పరగడుపున ఆ నీటిని తాగితే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి.
ఈ ఆకుల్ని పేస్టులా చేసి గాయాలకు పైపూతగా రాస్తే త్వరగా మానిపోతాయి.
తమలపాకుల్లోని యూజెనాల్ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది.
తమలపాకులు ఎండబెట్టి పొడిచేసి రోజూ పావు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
తమలపాకు నమలడం వలన డిప్రెషన్ కూడా తగ్గుతుందట.
తమలపాకుల్లోని టెర్పీన్లకి మలేరియాని నిరోధించే గుణాలు ఉన్నాయట.
తమలపాకు నమలడం వలన దంతాలమీద బ్యాక్టీరియా కూడా పెరగదని నిపుణులు చెబుతున్నారు.