వంటల్లో కసూరి మేతీ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
ఇటీవల చాలా వరకు పలు వంటకాల్లో కసూరి మేతిని కచ్చితంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దావత్ ఏదైనా కసూరి మేతి ఉండాల్సిందే.
ఇది వంటల రుచిని మాత్రం అద్భుతంగా పెంచుతుంది. అందుకే నిత్యం వాడే మసాలా దినుసుల్లో కసూరి మేతి ఒకటిగా మారిపోయింది. దీనిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
రోజు వారి వంటల్లో కసూరి మేతిని వాడటం వల్ల ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఉపశమనం కలుగుతుంది.
దీనిని తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడంతో పాటు గుండె జబ్బులు తగ్గుతాయి.
అలాగే బాలింతలు కసూరి మేతి తీసుకుంటే పాల ఉత్పత్తి చక్కగా పెరిగి మీ పిల్లలకు సరిపోయేన్ని పాలు వస్తాయి.
ఇటీవల అధిక బరువు సమస్య చాలా మందిలో మొదలైంది. అలాంటి వారు కసూరి మేతిని తినడం ఉపయోగకరం. దీంతో అధిక క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆహార లోపంతోనో లేదా ఇతర కారణాల వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే దీనిని తినాలి.
సూరి మేతిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొట్ట అలర్జీలను తగ్గించి, పొట్టను శుభ్రపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు కసూరి మేతితో తయారు చేసిన వంటకాన్ని తినడం వల్ల ఉపశమనం కలగడంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.