ఆవాల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

ఆవాలను పలు ఆహార పదార్ధాల్లో ఉపయోగిస్తారు. ఆవనూనెతో కొంత మంది వంటకాలు కూడా తయారుచేసుకుని తింటుంటారు.
అలాగే ఆవనూనెతో అనేక వ్యాధులతో పోరాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆవనూనె వల్ల గుండె జబ్బులు తగ్గించడంతో పాటు క్యాన్సర్ వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.
ఈ నూనెతో చిన్న పిల్లలకు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆవాల నూనెలో మైనం కలిపి పగిలిన మడమలకు పెట్టుకుంటే పగుళ్లు తగ్గుతాయి.
ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న కారణంగా చెవి ఇన్ఫెక్షన్లు, దురద వంటివి తగ్గుతాయి.
ఆవనూనె రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.