మునగాకు పొడితో ఆరోగ్యానికి చాలా మేలు

మునగకాయలతోనే కాదు మునగాకుల పొడితో ఆరోగ్యానికి మంచి లాభాలున్నాయి.
మునగాకుల పొడి ఒక గ్లాస్ నీటిలో వేసి తాగితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు తగ్గుతారు.
ఈ ఆకుల్లో క్వెర్సెటిన్ క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
మునగాకు పొడి చర్మానికి మంచి శక్తిని ఇచ్చి వృద్దాప్య లక్షణాలు కనిపించకుండా చేస్తుంది.