మనం ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర ఒకటి
ఈ పచ్చడిని చాలా మంది అమితంగా ఇష్టపడుతుంటారు.
అయితే చలికాలంలో ఈ ఆకుకూరను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
గోంగూరలో విటమిన్ సి, ఎ, బి 6తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
అందువలన శీతాకాలంలో గోంగురను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగు పడుతుంది, రక్త ప్రసరణ సజావుగా సాగుతుందంట.
కొన్నిరకాల క్యాన్సర్లకు ఇది మంచి ఔషధంలా పని చేస్తుంది.