పండే కాదు.. గింజలూ అమృతమే..

బొప్పాయి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పండు తియ్యగా ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఎ, బి, సి, ఇ, కె వంటి విటమిన్లు ఉన్నాయి.
బొప్పాయి పండే కాదు విత్తనాల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
బొప్పాయి గింజల్లో పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి.
ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయి గింజలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి..కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి.
బొప్పాయి గింజల్లో ఉండే పోషకాలు పలు రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.