బచ్చలి కూర తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు..
చలికాలం అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటికి దూరంగా ఉండటానికి జనాలు రకరకాల ఆకు కూరలను తిటుంటారు.
అయితే రోజూ మన ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బచ్చలి కూరలో యాంటీఆక్సీడెంట్లు ఉండటం వల్ల కళ్లకు రక్షణ కలిగిస్తూ.. కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ కె, కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి.
ఈ కూరలో ఉండే నైట్రేట్‌ల వల్ల అధిక రక్తపోటును తగ్గించి, రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు.