మొక్కజొన్నతోనే కాకుండా పీచులోనూ దాగున్న అద్భుత ప్రయోజనాలు..
మొక్కజొన్నతో పాటు, స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే.
వీటిల్లో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు, మెగ్నీషియం ఎక్కువగా ఉండటంతో మేలు చేస్తాయి. అయితే మొక్కజొన్న పీచు టీతోనూ అనే లాభాలున్నాయట.
మూత్రపిండాల్లో మలినాలు ఎక్కువగా ఉండే రాళ్లు ఏర్పడతాయి. అలాంటి వారు మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకుని తాగడం మంచిది.
దీని టీ తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు పలు రకాల సమస్యలు తగ్గుతాయి.
ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధిగ్రస్తులకు మొక్కజొన్నతో మంచి ఉపశమనం లభిస్తుంది.
అధిక బరువుతో బాధపడేవారు మొక్కజొన్న పీచును నీటితో వేసి మరిగించి వడకట్టి ఈ నీటిని తాగితే నాజుకుగా తయారవుతారు.
ఈ విషయాలు కేవలం ఇంటర్‌నెట్ ఆధారంగా తీసుకున్న సమాచారం మాత్రమే. వైద్యులను సంప్రదించాక పాటించాలి.