అరుదుగా దొరికే తేగలతో మహిళలకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

తేగలను ఉడకబెట్టి మెత్తగా చేసి బెల్లం లేదా చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయం బలంగా అవుతుంది. అలాగే కొబ్బరి పాలతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నీరసంగా ఉండే మహిళలు తేగలను ఎండబెట్టి పొడి చేసి బెల్లం లేదా తాటి సిరప్‌తో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది.
ప్రసవం తర్వాత తేగలను తినడం వల్ల పోయిన పోషకాలు తిరిగి వస్తాయి. పైగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తేగలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
ఇందులో విటమిన్ ఎ, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
40 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా ఐరన్ లోపంతో, రుతుక్రమ సమస్యలతో బాధపడుతుంటారు. వీరు ఈ తేగలను తినడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరిగి, సరైన రక్త ప్రసరణను నిర్ధారించడానికి సహాయపడుతుంది.
అలాగే తేగల్లో విటమిన్ B, విటమిన్ C అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి..