1977 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్-28 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలివే.. (వెబ్‌స్టోరి)
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే.. ఆ సినిమా రిలీజ్ డేట్ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాము.
అదే విధంగా ఏప్రిల్ 28 సినీ ఇండస్ట్రీ చరిత్ర లోనే లిఖించిన రోజు. ఎందుకంటే ఈ డేట్‌లో రిలీజైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాయి.
1977 నుంచి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ 28 న రిలీజై హిట్ కొట్టిన సినిమాలు లేవో తెలుసుకుందాం
1977 ‘అడవి రాముడు’. నందమూరి తారకరామరావు నటించిన ఈ మూవీ అప్పట్లోనే రూ. 3 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.
1994 ‘యమలీల’. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. 100 రోజులకు పైగా ఆడి పెద్ద హిట్ కొట్టింది.
2006 ‘పోకిరి’. మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతే కాకుండా సుమారుగా రూ. 66 కోట్లు వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది.
2017 ‘బాహుబళి-2’ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులను బద్దలు కొట్టిన విషయం అందరికి తెలిసిందే.
ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా.. 2023 ‘ఏజెంట్’. ఈ రోజు రిలీజైన ఈమూవీ కూడా పాజీటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.